హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

కడపలో బాలల దినోత్సవం సందర్భంగా జువెనైల్ జస్టిస్ బోర్డు చిల్డ్రన్స్ హోమ్‌లో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడారు. విద్య, ఆరోగ్యం, రక్షణ ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కులని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే తప్పులను సరిదిద్దుకుంటూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.