హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పబ్లిక్ పాలసీలో డిగ్రీ అందుకున్న కలెక్టర్

కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నుంచి పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ డిగ్రీ అందుకున్నారు. ప్రజాసేవల్లో బిగ్ డేటా, కృత్రిమ మేధస్సు వినియోగంపై పరిశోధన పత్రం సమర్పించారు. ఈ పరిజ్ఞానం జిల్లాలో ఆధునిక పాలనా విధానాల అమలుకు దోహదపడనుందని కలెక్టర్ తెలిపారు.