హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణిలో 18, 19న రిలే దీక్షలు

BDK: సింగరేణి సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఈ నెల 18, 19 తేదీల్లో జీఎం కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వంగా వెంకట్, వీరస్వామి ఈ విషయం ప్రకటించారు. కొత్తగూడెం శేషగిరి భవన్‌లో వారు శనివారం మాట్లాడారు. ప్రతినెలా మెడికల్ బోర్డు పెట్టి వారసులకు ఉద్యోగాలివ్వాలన్నారు. రూ. 59 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.