హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్దర్ విగ్రహ ఆవిష్కరణ కరపత్రాల విడుదల

WNP: ఈ నెల 19న వీపనగండ్ల మండల కేంద్రంలో జరగనున్న ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను చిన్నంబావి చౌరస్తాలో ఉద్యమ నాయకులు విడుదల చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గద్దర్ ఆశయాలు, ప్రజా ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటేలా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.