హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ స్టడీ సర్కిల్‌కు కొత్త హంగులు..!

గుంటూరులోని డా. బీఆర్ అంబేద్కర్ భవన్-కమ్-స్టడీ సర్కిల్‌కు కొత్త హంగులు రానున్నాయి. రెండో అంతస్తు, ఆధునిక సౌకర్యాలతో లైబ్రరీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ 2026-27 బడ్జెట్ నుంచి నిధులు కేటాయించారు. పేద విద్యార్థులకు పోటీ పరీక్షల తయారీలో ఉపయోగపడనుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చొరవతో ప్రాజెక్టు ముందుకు కదిలింది.