VKB: బొంరాస్పేట్ మండలంలోని మహంతిపూర్ గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. గ్రామ రహదారులపై గుంపులుగా సంచరిస్తూ వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎప్పుడు దాడి చేస్తాయోనని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
గ్రామంలో వీధి కుక్కల బెడద


