హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు వృథా

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 36, 37 వార్డులను కలిపే రాజారాం కాలేజీ రోడ్డుపై మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో మూడు రోజులుగా తాగునీరు వృథాగా పారుతుంది. రోడ్డుపై మూడు చోట్ల పైప్‌లైన్ దెబ్బతినగా, ఒకచోట భారీగా నీరు బయటకు వస్తుంది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.