హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్లపై నుంచి పడి చిన్నారికి గాయాలు

NLG: శాలిగౌరారం మండల కేంద్రంలోని జేఎంజే ప్రైవేట్ పాఠశాలలో బాలల దినోత్సవం రోజునే ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులోని తరగతి గది నుంచి మెట్లు దిగే క్రమంలో విద్యార్థుల తోపులాటతో గుర్జాల గ్రామానికి చెందిన ఒకటో తరగతి చిన్నారి జారిపడి తీవ్రంగా గాయపడింది. ఘటనపై తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాఠశాల యాజమాన్యంపై చిన్నారి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.