హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయ వాద పరిషత్ నూతన కమిటీ ఎన్నిక

PDPL: పెద్దపల్లి జిల్లా న్యాయవాద పరిషత్ నూతన కమిటీని ఏకగ్రీవం ఎన్నుకున్నారు. గోదావరిఖనిలోని వి.హెచ్.పి. భవన్‌లో జరిగిన సమావేశంలో ఆరు బార్లకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఆరె మధు, ప్రధాన కార్యదర్శిగా రాచూరి శ్రీకాంత్, కోశాధికారిగా గుడ్ల వెంకటేష్ ఎన్నికయ్యారు. న్యాయవాదుల ఐక్యతను పెంపొందించడం, పేదలకు ఉచిత న్యాయసాయం తమ లక్ష్యమన్నారు.