SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి కార్తీక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో జరుగుతోంది. ఐదో రోజు వేడుకలను ఆలయ ఏఈఓ జయకుమారి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. డిసెంబర్ 8 వరకు ప్రతి సాయంత్రం 6 నుంచి రాత్రి వరకు సుహాసినులు సామూహికంగా దీపాలు వెలిగిస్తున్నారు. పాల్గొన్న మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, వాయనం, స్వామి చిత్రపటం ఇచ్చారు.
తెలంగాణ
వేములవాడలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం


