హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

అన్నమయ్య: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో రాజంపేట డీఎస్పీ కె. వెంకట్రామయ్య మన్నూరు పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి బందోబస్తు విధులపై బ్రీఫింగ్ నిర్వహించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించి, డ్యూటీ పాస్‌పోర్టులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ లింగప్ప పాల్గొన్నారు.