హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై గ్రామస్తుల ఆందోళన

KMR: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిందని సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామస్తులు గ్రామసభలో సర్పంచ్, పాలకవర్గాన్ని నిలదీశారు. కమిటీ సభ్యుల సంతకాల కోసం తెల్ల కాగితాలు పంపించారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంపీడీవోకు గతంలో వినతిపత్రం ఇచ్చినా విచారణ జరగలేదని తెలిపారు. వీడియో ఆధారాలతో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.