హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: సీఐ

కృష్ణా: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుడివాడ సత్యనారాయణపురం, అరవపేట ప్రాంతాల్లో టూ టౌన్ సీఐ హనీశ్ కుమార్ శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.