హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

శ్రీకాకుళం జిల్లాలో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నగరపాలక, ఆమదాలవలస, కాశీబుగ్గ డివిజన్లోని ఏడు మండలాల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి శనివారం ప్రకటన చేశారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా, ర్యాలీలపై నిషేధం ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.