హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ షాక్‌.. లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలు

KRNL: క్రిష్ణగిరి మండలంలో శనివారం విద్యుత్‌ ఫ్యూజ్‌ వేస్తుండగా షాక్‌ తగిలి లైన్‌మెన్‌ బ్రహ్మం తీవ్రంగా గాయపడ్డారు. సమీప పొలంలోని యజమాని అప్రమత్తమై తువ్వాలుతో ఆయనను విద్యుత్‌ ప్రభావం నుంచి తప్పించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. తొలుత వెల్దుర్తి ఆసుపత్రిలో చికిత్స అందించారు, మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.