కృష్ణా: దుబాయ్‌లోని రస్ అల్ ఖైమహ్ వేదికగా జరుగుతున్న ఆసియన్ లేజర్ రన్ పోటీల్లో గన్నవరం మండలం చిన్న అవుటపల్లికి చెందిన విజయ్ గోగులమూడి రజత పతకం సాధించాడు. వివిధ దేశాల క్రీడాకారులతో పోటీపడి ద్వితీయ స్థానంలో నిలిచి భారత జెండాను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. విజయ్ సాధించిన విజయంపై వ్యాయామ ఉపాధ్యాయులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ క్రీడల్లో గన్నవరం యువకుడి సత్తా


