హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా తాళ్లూరి దుర్గ

NTR: చిల్లకల్లు గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో తాళ్లూరి దుర్గ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన పోటీ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కీలక సమస్యలపై దృష్టి సారించి, పారదర్శక పాలన అందిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజల విశ్వాసమే తన బలం అని దుర్గ పేర్కొన్నారు.