హైదరాబాద్: 28°C
వార్తలు

సోమేశ్వరాలయంలో అయ్యప్ప భక్తుల సందడి

JN: పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అయ్యప్ప మాల ధారణ భక్తుల సందడి చేశారు. వందల సంఖ్యలో భక్తులు ఒకేసారి ఆలయానికి వచ్చి మాలాధారణ అనంతరం తొలి పూజలు చేశారు. అంతకుముందు భక్తులు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని మాలలను స్వీకరించారు. అయ్యప్ప నినాదాలతో ఆలయం దద్దరిల్లింది.