HNK: హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామ శివారులో శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.36,670 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ వెల్లడించారు.
వార్తలు
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి


