హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలల దినోత్సవం రోజున విషాదం.. చిన్నారి మృతి

ATP: వేపరాళ్ల గ్రామ శివారులో బాలల దినోత్సవం రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పైనుంచి పడి ఐదేళ్ల చిన్నారి అక్షర ప్రాణాలు కోల్పోయింది. బట్టీల్లో పనికి వలస వచ్చిన కూలీల కూతురు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.