హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిరోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..?

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. 1వ వార్డులో వైసీపీ నుంచి ఒకటి, 15వ వార్డులో రెండు, 39వ వార్డులో టీడీపీ నుంచి రెండు నామినేషన్లు నమోదయ్యాయి. ఈ నెల 16 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ తెలిపారు.