హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా సైన్స్ కాంగ్రెస్ లో 87 ప్రాజెక్టుల ప్రదర్శన

శ్రీకాకుళం నగరంలోని జిల్లా సైన్స్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన 32వ జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో 87 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఐదు విభాగాల్లో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఏడు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు డీఈఓ ఎ. రవిబాబు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి.