హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs PAK: చివరి బంతికి ఉత్కంఠ విజయం

PAKతో జరిగిన U-19 ఆసియా కప్ ఫైనల్లో భారత ప్లేయర్లు సంచలన ప్రదర్శన చేశారు. 339 పరుగుల ఛేదనలో భారత్.. 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా 9వ వికెట్‌కు 57 పరుగులు జోడించారు. చివరి వికెట్‌కు మోహిత్, చిగురుపాటి వెంకట 16 బంతుల్లో 30 పరుగులు చేసి విజయతీరాలకు చేర్చారు. ఇక చివరి బంతికి 3 పరుగులు చేయాల్సిన సమయంలో మోహిత్ ఫోర్ కొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.