హైదరాబాద్: 28°C
క్రీడలు

సిరాజ్ చేసిన తప్పేంటి?: ఆకాశ్ చోప్రా

న్యూజిలాండ్ పర్యటనలో మహ్మద్ సిరాజ్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో అవకాశం దక్కలేదు. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జట్టు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అతడిని ఎందుకు ఆడించడం లేదో అర్థం కావడం లేదన్నాడు. అతడు చేసిన తప్పేంటి? అంటూ ప్రశ్నించాడు. అతడిని బెంచ్‌కే పరిమితం చేయడానికి గల కారణం ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేశాడు.