హైదరాబాద్: 28°C
క్రీడలు

22 పరుగులు దూరంలో విరాట్ కోహ్లీ

రేపు న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డేలో విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు కివీస్‌పై 39 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 1,978 పరుగులు చేశాడు. మరో 22 పరుగులు చేస్తే.. వన్డే చరిత్రలో NZపై 2,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటికే ఆ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికీ పాంటింగ్ (1,971) రికార్డును బద్దలు కొట్టాడు.