హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

ములుగు కేంద్ర గ్రంథాలయంలో 59వ గ్రంథాలయ వారోత్సవాలను ఛైర్మన్ భానోత్ రవిచందర్ ప్రారంభించారు. మంత్రి సీతక్క సహకారంతో నూతన భవనం, టాయిలెట్లు, ప్రహరీ నిర్మించి వసతులు కల్పించామని తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు భోజనం, టీ అందిస్తున్నామన్నారు. వారోత్సవాల్లో సీతక్కను ఆహ్వానిస్తామని చెప్పారు. ఇందులో ప్రజాప్రతినిధులు, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.