హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివపురం బాల్య వివాహ రహిత గ్రామం

MLG: చిన్నబోయినపల్లి, శివపురం గ్రామాల్లో నిర్వహించిన బాలల సభల్లో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత పాల్గొని బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రతపై అవగాహన కల్పించారు. పిల్లలకు స్నేహపూర్వక గ్రామాల నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఏడాది కాలంగా బాల్యవివాహాలు నమోదు కానందున శివపురాన్ని బాల్యవివాహ రహిత గ్రామంగా ప్రకటించారు.