SRPT: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల సదనం, శిశు గృహాలను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం ప్రారంభించారు. అనాథ, నిరాశ్రయ చిన్నారులకు మెరుగైన వసతి, నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. చిన్నారుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.
తెలంగాణ
బాల సదనం, శిశు గృహాలు ప్రారంభం


