హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరీక్షల విభాగం తీరుపై విద్యార్థుల ఆరోపణలు

WGL: కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం తీరుపై డిగ్రీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, హాల్‌టికెట్లలో సబ్జెక్టుల పేర్లు కనిపించక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పట్టించుకోవాలని వాపోతున్నారు.