హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచకప్ జట్టులో రోహిత్ స్థానం డౌటే?

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ 3 ఇన్నింగ్స్‌ల్లో 23 పరుగులే చేశాడు. రెండుసార్లు డకౌటయ్యాడు. దీంతో రాబోయే వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ స్థానం ప్రశ్నర్థకంగా మారింది. రోహిత్ ప్రదర్శన ఇలానే ఉంటే అతడిని జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే యువ ఓపెనర్ జైస్వాల్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.