NLG: చింతలపాలెం మండలం ఎర్రకుంట తండా చెరువును నింపాలని కోరుతూ 80 ఏళ్ల వయసున్న రైతులు సైతం కర్రల సాయంతో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. శివగంగ లెఫ్ట్ కెనాల్ ద్వారా చెరువుకు నీటిని మళ్లించే మార్గాన్ని అధికారులు గుర్తించి పనులు చేపట్టాలని కోరారు. చెరువులో నీరు లేక పశువులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఎర్రకుంట చెరువు నింపాలని రైతుల ధర్నా!!


