హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌పై టీమిండియా సంచలన విజయం

పాకిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన U-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ లక్ష్య రాజేష్ (80), ఆర్యవీర్ సెహ్వాగ్ (58) హాఫ్ సెంచరీలు చేశారు. చివర్లో మనల్ చౌహాన్ (47), మోహిత్ ఉల్వా (49*), చిగురుపాటి వెంకట (14*) అద్భుత ఆటతీరుతో భారత్‌ను గెలిపించారు.