హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న యువ భారత్

భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. దాయాదుల పోరు చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడగా.. చివరికి భారత్ అద్భుత పోరాటంతో విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత విజయంపై SMలో ప్రశంసల వర్షం కురుస్తోంది.