SRCL: వేములవాడ రూరల్ మండలం జయవరంలో జరుగుతున్న భూముల రీసర్వేను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం పరిశీలించారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భూముల వివరాలను రైతులకు తెలియజేసి వారి సంతకాలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, సర్వే, వ్యవసాయ శాఖలు సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
భూముల రీ సర్వే ను పరిశీలించిన కలెక్టర్


