హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా కొనసాగుతున్న దూరవిద్య పరీక్షలు

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 11న ప్రారంభమైన పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల సమన్వయకర్త ఆచార్య దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. శనివారం పరీక్షా కేంద్రాన్ని ఆచార్య గొర్రెపాటి రోశయ్య, ప్రొఫెసర్ పీ.సుధాకర్ సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆచార్య వెంకటేశ్వర్లు ఉన్నారు.