హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువ క్రీడాకారులను ప్రోత్సహించిన శివప్రసాద్

అన్నమయ్య: రాజంపేటలోని స్థానిక డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో వాలీబాల్ క్రీడాకారులను రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతం శివప్రసాద్ కలిశారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సుమారు రూ.30 వేల విలువైన వాలీబాల్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు.