హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ ఉచ్చులు బిగిస్తే కఠిన చర్యలు తప్పవు'

MNCL: వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ ఉచ్చులు బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ శాఖ డివిజన్ అధికారి రామ్మోహన్ హెచ్చరించారు. శనివారం దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మండలంలోని మామిడిపల్లి శివారులో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో పడి ఒక వ్యక్తి మృతి చెందడం బాధను కలిగించిందన్నారు.