MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని మాత ఆలయంలో శనివారం రాత్రి ఐదవ రోజు కార్తీక మాస దీపారాధన వేడుకలు ఘనంగా జరిగాయి. మూలవిరాట్ అమ్మవారికి ప్రదోషకాల పూజ, అభిషేకాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివలింగాకారంలో ముగ్గులు వేసి చుట్టూ దీపాలు వెలిగించారు. ఆలయ నిర్వాహకులు ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా దీపారాధన దీపోత్సవం


