హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 18,591 చేయూత పెన్షన్లు మంజూరు

SRD: కొంతకాలంగా ఎదురుచూస్తున్న నూతన చేయూత పెన్షన్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 18,591 పెన్షన్లు మంజూరయ్యాయి. వీరిలో వితంతువులు 13,391, ఒంటరి మహిళలు 2,251, దివ్యాంగులు 2,488, గీత కార్మికులు 456, చేనేత కార్మికులు ఐదుగురు ఉన్నారు. ఈ నెల 18వ తేదీలోపు మంజూరు పత్రాలు అందజేస్తామని ఇంఛార్జ్ DRDO ఉమాహారతి తెలిపారు.