హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

203 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు

PLD: నరసరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్టు, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 203 మందికి పరీక్షలు చేసి 98 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. గతంలో ఆపరేషన్లు చేయించుకున్న124 మందికి కళ్లజోళ్లు అందించారు. కార్యక్రమంలో డాక్టర్లు కోడెల శివరామ్, సౌజన్య, మందాడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.