హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇన్‌స్టా రౌడీ గ్యాంగ్ అరెస్ట్

KMM: ఇన్‌స్టాగ్రామ్‌లో రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు పెడుతున్న తెల్లపొట్ట మురళీకృష్ణను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం పట్టుకుంది. తల్లాడ మండలం పినపాకకు చెందిన అతడు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. సోషల్ మీడియాలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.