హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్పొరేషన్ ఎన్నికలు.. తొలిరోజు 19 నామినేషన్లు

E.G: నగరపాలక సాధారణ ఎన్నికలు- 2026 లో భాగంగా తొలి రోజు శనివారం నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగిందని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. 72 డివిజన్లకు సంబంధించి వార్డు సభ్యుల స్థానాలకు 19 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. ఇందులో TDP నుంచి 10, YCP నుంచి 4, జనసేన నుంచి 1, BJP నుంచి 1, ఇతర పార్టీలు 1, స్వతంత్ర అభ్యర్థులుగా 2 మొత్తం 19 నామినేషన్లు అందాయన్నారు.