హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాచారం గుట్టలో వైభవంగా కార్తీక దీపోత్సవం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాస శనివారం సందర్భంగా ఆకాశ దీపారాధన ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో రంగాచారి ఆధ్వర్యంలో అర్చకులు కమలం ఆకారంలో దీపోత్సవం చేపట్టారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు.