హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధులన్నీ కొడంగల్‌కేనా: మాజీ మంత్రి సబితా

VKB: కొడంగల్ అభివృద్ధిపైనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాలోని ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. శనివారం మాట్లాడిన ఆమె, కొడంగల్‌కు రూ. 9,100 కోట్లకు పైగా నిధులు ఇస్తున్నట్లు చెబుతున్న సీఎం, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.