హైదరాబాద్: 28°C
తెలంగాణ

CM రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎంపీ

NRPT: జిల్లాకు చెందిన పలువురు బాధితులకు శనివారం ఎంపీ డికే అరుణ మహబూబ్ నగర్ పార్టీ జిల్లా కార్యాలయంలో CM రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ విషయాన్ని నేతలు పగుడాకుల శ్రీనివాస్, నందు తెలిపారు. బోయిన్ పల్లికి చెందిన హనుమంతుకు రూ.48 వేలు, జిల్లా కేంద్రానికి చెందిన అశోక్ రూ.13 వేలు, కమలాబాయి రూ.9 వేలు, మరికల్ నర్సమ్మకు రూ.28 వేల చెక్కులను అందించారు.