హైదరాబాద్: 28°C
వార్తలు

భారత పర్యటనకు పాకిస్థాన్‌ మంత్రి

ఢిల్లీలో నవంబర్ 20 నుంచి 22 వరకు జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) నాగరికత సమావేశాలకు పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ సమావేశాల కోసం పాక్ మంత్రి భారత్‌లో పర్యటించనుండటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.