హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతుడి ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగింత

KRNL: బస్టాండ్‌లో ఈ నెల 13న అనారోగ్యంతో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తిని గిద్దలూరుకు చెందిన మేకల తిరుపాలుగా పోలీసులు గుర్తించారు. శనివారం మృతుడి భార్య, ముగ్గురు కుమార్తెలకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. ఎస్సై పీ.నరేష్ పంచనామా నిర్వహించి, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.