ATP: అనంతపురం పోలీస్ రక్షక్ ప్రైమరీ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ భాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులు పాటలు, నృత్యాలు, పద్యాలు, నాటికలతో అలరించారు. స్పానిష్ భాషలో తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ప్రతిభను పెంపొందించాలని అదనపు ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ రక్షక్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు


