హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ASR: డుంబ్రిగూడ మండలం అరకు TERDS NGOలో జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, విద్యా హక్కు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం, బాలలపై వేధింపుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న బాలల కోసం 1098 సేవలను వినియోగించుకోవాలన్నారు.