హైదరాబాద్: 28°C
తెలంగాణ

కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికితే.. రూ.2 లక్షలు మాయం!

NRML: కుబీర్‌కు చెందిన బాలాజీ ఆన్‌లైన్ మోసానికి గురై రూ.2 లక్షలు కోల్పోయాడు. అమెజాన్ ఆర్డర్ రద్దు చేసుకుని డబ్బుల వాపసు కోసం గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేయగా, అవతలి వ్యక్తి సూచనలతో డబ్బులు పోగొట్టుకున్నాడు. గూగుల్‌లో కనిపించే నంబర్లను నమ్మవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వవద్దని ఎస్సై కృష్ణారెడ్డి హెచ్చరించారు.